హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు కటకం నర్సింగరావు తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీలందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు.
మన ఆలోచన సాధన సమితికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఇతర బీసీ సంఘాలతో స్నేహసంబంధాల కలిగి లక్ష్యం సాధిస్తామన్నారు. బీసీలకు జాతి సంపదను జనాభా దామాషాలో ఆర్థిక వనరులను, చట్టసభల్లో వాటాను, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తూ రాజ్యాధికారం సాధిస్తామన్నారు. ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు ఇంత ఆనందం, ఆవుల వెంకన్నయాదవ్, పూసల నర్సింహా, కాశీనాథం, పీఎల్ఎన్ రావు, సమ్మయ్య, ముత్తిలింగం, బూర నారాయణగౌడ్, కుమారస్వామి, సూర్యనారాయణ, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, రిటైర్డ్ డీఎస్పీ డోలి మొగిలి పాల్గొన్నారు.