వరంగల్ డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉమ్మడి జిల్లా నేతలు మంగళ వారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూద నాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ధరంసోత్ రెడ్యానాయక్, తాటికొండ రాజయ్య తదితరులున్నారు.