ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన వలుగుల సాహిత్య(17) భీమారంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది.
హసన్‌పర్తి, మార్చి 8: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన వలుగుల సాహిత్య(17) భీమారంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. పరీక్షలు సరిగా రాయలేదని రెండు రోజులుగా మనస్తాపం చెందింది. ఈనేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున సూసైడ్ నోట్ రాసి కళాశాల భవనం నుంచి కింద దూకింది.
కళాశాల యాజమాన్యం ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో వచ్చి కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు శాంతింపజేశారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

