Mee Seva | మహబూబాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఒకే చోట అనేక సర్వీసులను అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులం, నివాసం, ఆదాయం తదితర సర్టిఫికెట్లతో పాటు ఇతర సేవల కోసం ప్రజలు మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధన తీసుకొస్తూ అటు వినియోగదారులు, ఇటు మీ సేవ నిర్వాహకులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తాజాగా అన్ని మీ సేవ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ ద్వారానే చెల్లింపులు చేయాలనే నిబంధనను అమల్లోకి తెచ్చింది.
దీనివల్ల పట్టణ ప్రాంతాల వారికి తకువ ఇబ్బందులున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నివసిస్తున్న చాలా మందికి ఫోన్ పే, గూగుల్ పే లాంటి పేమెంట్ యాప్స్ లేవు. ఏదైనా దరఖాస్తు చేయాలని మీ సేవ కేంద్రానికి వస్తే క్యూఆర్ కోడ్ సాన్ చేసి డబ్బులు చెల్లించాలని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే వినియోదారులకు యూపీఐ యాప్స్ లేని పక్షంలో నిర్వాహకునికి డబ్బులిచ్చి అతని ద్వారా క్యూఆర్ కోడ్ సాన్ చేసి చెల్లించాలనే నిబంధన వచ్చింది. రెండు నెలల క్రితమే ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, కొద్ది రోజుల నుంచి క్యూఆర్ కోడ్ ద్వారానే చెల్లింపులు చేయాలనే ఖచ్చితమైన నిబంధన విధించారు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదురొంటున్నారు.
ఇబ్బందులు ఇవే..
పాత పద్ధతిని కొనసాగించాలి
మీ సేవలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ అమలు విధానానికి మేము వ్యతిరేకం కాదు. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు దీని ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్యూ ఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు అమల్లో ఉన్నప్పటికీ పాత విధానం కూడా అలానే ఉంచితే వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
– రావిపాటి దేవేందర్రావు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మీసేవ అసోసియేషన్