హనుమకొండ, జనవరి 6 : టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన విద్యుత్ ప్రజాబాట మొక్కబడిగా మారింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిషారం చేసి మెరుగైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ సమస్యలు ఎ కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం లేకపోవడంతో ప్రజల నుంచి స్పందన కరువైంది. సాధారణంగా ప్రజాబాట వంటి కార్యక్రమాలు విజయవం తం కావాలంటే ప్రణాళికలు రూపొందించి ముందురోజు నుంచి ప్రచారం, తేదీలు, సమయాలు, అధికారుల వివరాలు ప్రజలకు తెలియజేయాల్సినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం అవేమీ లేకుండా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీని గురించి తమకేమీ తెలియదని, ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసుల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మంగళవారం నుంచి ప్రజాబాట కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించినట్లు సర్కిళ్ల అధికారులు తెలుపడం గమనార్హం.
ప్రణాళికలు లేకుండా కార్యక్రమం
ఎన్పీడీసీఎల్ అధికారులు ఎలాంటి ప్రణాళికలు లేకుండా ప్రతి మంగళవా రం, గురువారం, శనివారాల్లో క్షేత్ర స్థా యిలో పర్యటించి విద్యుత్ వినియోగదారుల నుంచి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రా రంభిస్తున్న కార్యక్రమంపై ముందస్తుగా అవగాహన కల్పించాల్సి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని సెక్షన్లలో మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేవని కార్యక్రమం ప్రారంభం కా నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతా ల్లో విద్యు త్ కోతలు, లోవోల్టేజీ, ట్రాన్స్ఫార్మర్ సమస్య లు, వ్యవసాయ విద్యుత్ అంతరాయాలు వంటి తీవ్రమైన సమస్యలుండగా అకడ ప్ర జాబాట నిర్వహించకపోవడంపై రైతులు, గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించి, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఈ విషయం పై ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని ఆపరేషన్ డైరెక్టర్‌ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.
ప్రజా బాటను ప్రారంభించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
హనుమకొండ సరిల్ పరిధిలోని ఎస్ఎస్ 29, నక్కలగుట్ట సెక్షన్ భవానీనగర్‌లో ప్రజాబాట కార్యక్రమాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కాలనీవాసులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి సమస్యలు పరిషరించడమే ప్రజాబాట లక్ష్యమని సీఎండీ తెలిపారు. ప్రతి మంగళవా రం, గురువారం, శనివారాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 11 కేవీ లైన్లు, డీటీఆర్లు, ఎల్టీ లైన్ల లోపాలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి సరిచేయాలని అధికారులను ఆదేశించారు. డైరెక్టర్ ఆపరేషన్ టీ మధుసూదన్, సీజీఎం కే రాజు హాన్, హనుమ కొండ ఎస్ఈ పీ మధుసూదన్‌రావు, డీఈలు జీ సాంబారెడ్డి, విజేందర్‌రెడ్డి, దర్శన్‌కుమార్, ఏడీఈ ఇంద్రసేనారెడ్డి, ఏఈ ప్రవీణ్, స్థానికులు పాల్గొన్నారు.