నెక్కొండ, డిసెంబర్ 12 : బిల్లులు చెల్లించడం లేదని అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో నెక్కొండ మండలం అలంకానిపేట శివారు ప్రాంత రైతులు ఆగమవుతున్నారు. కరెం టు లేక సాగునీరందక సుమారు 400 ఎకరాల్లో మక్కజొన్న, మిర్చి పంటలు ఎండిపోతున్నాయ ని ఆవేదన వ్యక్తంచేశారు. అలంకానిపేట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని అలంకానిపేట, రెడ్యానాయక్ తండా శివారు ప్రాంతాల్లో ఐదు రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలను అమలు చేస్తున్నా రు.
వ్యవసాయరంగానికి నెలకు రూ.50 చొప్పు న ఏటా రూ.600 రైతుల నుంచి సర్‌చార్జ్ పేరిట విద్యుత్‌శాఖ వసూలు చేస్తున్న ది. ఇవి రైతులు చెల్లించడంలేదంటూ అధికారులు కోతలు విధిస్తున్నారు. కేవలం మధ్యా హ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 వరకే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో రైతులు సాగుచేస్తున్న మక్కజొన్న, మిర్చి పంట లు వళ్లిపోతున్నాయి. ఈ విషయాన్ని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. తాము బిల్లు చెల్లించామని, మాకెందుకు విద్యుత్ కోతలంటూ కొంద రు రైతులు ప్రశ్నిస్తే అందరూ బిల్లులు చెల్లించేలా చూడాలంటూ సమాధానం చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని అందరు రైతులు బిల్లులు చెల్లించే వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటూ తెగేసి చెబుతున్నారు.
అందరు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తరట..
నేను ఆరు ఎకరాల్లో మక్కజొన్న పంట సాగు చేశా. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నారు. దీంతో మక్కజొన్న పంట వళ్లిపోతున్నది. నాలుగు గంటలే పంటకు తడి అందుతున్నది. రెండు ఎకరాల పంట మాత్రమే పచ్చ గా ఉన్నది. మిగిలిన నాలుగెకరాల్లో పంట ఎండిపోతున్నది. లైన్మెన్ను అడిగితే అందరితో బిల్లులు చెల్లించాలని చెబుతున్నాడు. బిల్లులు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తామంటున్నాడు. గ్రామానికి చెందిన రైతులు గాజుల గోపాల్, కోరుకొండ శ్రీనివాస్, మాదాసు సో మయ్య, గాజుల అనంతరాములు త దితర రైతులందరిది ఇదే పరిస్థితి. త క్షణం విద్యుత్ కోతలను ఎత్తివేసి మ క్కజొన్న పంటను కాపాడాలి.
– చీకటి శ్రీనివాస్, రైతు, అలంకానిపేట
కోత పెడితేనే రైతులు చెల్లిస్తారు : లైన్ ఇన్స్పెక్టర్
ఈ విషయమై లైన్ ఇన్స్పెక్టర్ రవీందర్‌ను వివరణ అడుగగా కోతలు విధిస్తేనే రైతులు బిల్లులు చెల్లిస్తారని జవాబిచ్చా రు. ‘గత మూడు రోజులుగా బిల్లుల కో సం ఇలాగే కరంటు కట్ చేస్తున్నాం. మ క్కజొన్న పంట ఎండిపోతున్నదని రైతు లు చెబుతున్నారు కానీ ఇదే పరిస్థితి అన్ని సబ్‌స్టేషన్లలోనూ ఉంది.