HANAMAKONDA | హనుమకొండ చౌరస్తా, మార్చి 29: పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ 10వ డివిజన్లోని మచిలీబజార్, నబీఖాన వద్ద రూ.75 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ దశలవారిగా అన్ని డివిజన్లలో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని, రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీవాసులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గ్రేటర్ వరంగల్‌కు మరిన్ని నిధులు తీసుకొచ్చి వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు శోభనబోయిన కుమార్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ నజీమ్ జిహాన్, నజీర్ బాయ్, గంగు ఉపేంద్ర శర్మ, అంబటి మహేందర్, పల్లం రమేష్, మాడిశెట్టి సతీష్, బొంత రాఘవులు, జాఫర్ ఖాన్, షేక్ యాకూబ్, సంపతి కృష్ణ, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.