ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం జరిగే తుది విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మొత్తం 24 మండలాల్లో పంచాయతీ పోరు జరగనుంది. మొత్తం 564 సర్పంచ్ స్థానాలు, 4,896 వార్డులుండగా, 34 సర్పంచ్, 765 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో ఒక వార్డుకు నామినేషన్లు రాలేదు. దీంతో మిగిలిన 530 సర్పంచ్, 4,130 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి మంగళవారం పోలింగ్ సిబ్బంది సామగ్రితో పోలింగ్ సెంటర్లకు తరలివెళ్లారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరగనుండగా, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట వార్డు సభ్యులు, అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ పిదప ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భూపాలపల్లిలో 78 జీపీలు..
జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లోని 81 గ్రామ పంచాయతీలు, 696 వార్డులకు మూడో విడతలో ఎన్నికలు జరుగనుండగా, ఇప్పటికే మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 78 జీపీలకు జరగనున్న ఎన్నికల్లో 297 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 696 వార్డుల్లో 126 ఏకగ్రీవం కాగా, మిగిలిన 570 వార్డులకు పోలింగ్ జరగనుండగా 1,365 మంది పోటీలో నిలిచారు. మొత్తం 99,313 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోను న్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

పాలకుర్తి నియోజకర్గంలో..
జనగామ, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన దేవరుప్పుల, పాలకుర్తి, కొడకం డ్ల మండలాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. మండలాల్లో మొత్తం 91 జీపీలకు మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీ వం కాగా, మిగిలిన 88 పంచాయతీల్లో 265 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 800 వార్డు స్థా నాల్లో 81 ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 9 వార్డులకు 1,632 మంది బరిలో నిలిచారు. 59,001 మంది పురుషులు, 5 9,866 మహిళలు మొత్తం 1,18,870 ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనుండగా వీరికోసం 800 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేశారు. పీవోలు 597, ఓపీవోలు 597, మొత్తం 1,194 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఒక్కో మండలానికి ఏసీపీ, సీఐ సహా ఇద్దరు చొప్పున ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు ఆయా గ్రామాల్లో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. వీరితోపాటు ఒక్కో బైక్‌పై ఇద్దరు చొప్పున ఐదు రూట్ మొబైల్ టీంలను నియమించారు.
67 జీపీలు.. 563 వార్డులు..
హనుమకొండ : జిల్లాలోని ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లోని 68 గ్రామ పంచాయతీల్లో ఒకటి, 634 వార్డుల్లో 71 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 67 జీపీలు, 563 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. పురుషులు 54,293, మహిళలు 57,528, ఇతరులు ఒకరితో కలిపి మొత్తం 1,11,822 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 634 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 780 బ్యాలెట్ బాక్స్‌లు వినియోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు పీవోలు 626, ఓపీవోలు 897, మొత్తం 1,523 మంది ఆయా పోలింగ్ కేంద్రాలకు మంగళవారం తరలివెళ్లారు. 1,991 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ముగ్గురు చొప్పున డీసీపీలు, అదనపు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 29 మంది ఇన్స్పెక్టర్లు, 131 మంది ఎస్సైలు, 120 మంది ఏఎస్సైలు, 339 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 1,218 మంది కానిస్టేబుళ్లు, 258 మంది హోంగార్డ్స్‌తో పాటు డిస్ట్రిక్ గార్డ్స్, బాంబు డిస్పోజల్ విభాగాల సిబ్బంది ఉన్నారు.
మహబూబాబాద్‌లో 169 జీపీలు..
మహబూబాబాద్, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మరిపెడ, డోర్నకల్, కురవి, సీరోలు, కొత్తగూడ, గంగారం మండలాల్లో మొత్తం 169 జీపీలకు 19, అలాగే 1,412 వార్డులకు 272 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 150 సర్పంచ్ స్థానాలకు 516, అదేవిధంగా 1,139 వార్డులకు 2,869 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆరు మండలాల్లో మొత్తం 1,71,502 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,138 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, పీవోలు 1,732, ఓపీవోలు 1,894 మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఏడుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 50 ఎస్సైలు, వేయి మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.
వరంగల్ జిల్లాలో 102 జీపీలు..
ఖిలావరంగల్ : వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో బుధవారం తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. నాలు గు మండలాల్లో మొత్తం 109 జీపీలుండగా, ఇందులో ఏడు సర్పంచ్, 946 వార్డులకు 137 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 102 సర్పంచ్‌లకు 307 మంది, 809 వార్డు స్థానాలకు 1,895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. 63,059 మంది పురుషులు, 65,6 90 మహిళలు, ఇతరులు ఏడుగురు ఓటు హక్కును వినియోగించుకోనున్నా రు. నాలుగు మండలాల్లో అధికారులు 946 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,675 మంది సిబ్బంది పో లింగ్ విధులు నిర్వర్తించనున్నారు. కా గా, చెన్నారావుపేట, ఖానాపూర్ మండలాల్లోని 12 సమస్యాత్మక కేంద్రాలు, 110 సున్నితమైన వార్డుల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
ములుగులో 45జీపీలు.. 330 వార్డులు
ములుగు, (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల్లోని 45 గ్రామ పంచాయతీల్లో చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 53,423 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు 400 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 46 గ్రామ పంచాయతీలకు కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి సర్పంచ్ స్థానం ఇప్పటికే ఏకగ్రీవమైంది. అలాగే 408 వార్డులకు 78 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 330 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం పీవోలు 436, ఓపీవోలు 486, మొత్తం 922 మంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 414 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు.