చిల్పూరు, జనవరి 21: కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేసిందని మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో మంగళవారం నిర్వహించిన రైతు ధర్నాలో ము ఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోవడం, హామీలను కేవలం ప్రచార హోదాలో పరిమితం చేయ డం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తున్నదని విమర్శించారు.
రైతు భరోసా కింద రూ. 15,000 వెంటనే అందించాలని డిమాండ్ చేశా రు. రైతుల సమస్యలను పకదోవ పట్టించే కాంగ్రె స్ పార్టీ తీరుపై ప్రజలు గట్టిగా స్పందించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే రాజీనామా చేసి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఆఫీస్ ఇన్చార్జి ఆకుల కుమార్, కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు బత్తుల రాజన్‌బాబు, రంగు హరీశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు వెన్నం మాధవరెడ్డి, రచ్చ రవీందర్, అరూరి స్వామి, మండల నాయకులు కుమారస్వామి, నలిమెల రజినీకర్, మంతెన రాజు, రాజబాబు, చిర్ర రాజు, వెంకటస్వామి, ఎడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.