జనగామ, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఎల్కతుర్తిలో కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మం దితో నిర్వహించిన బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభలో జనం కాదు.. అది ప్రభంజనమని, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే మరో ఘట్టమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నా రు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వం పోలీసులతో కలిసి సభను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు పన్ని నా..ప్రజలను రానివ్వకుండా చేసినా వందశాతం సూపర్ డూపర్ సక్సెస్ కావడం ఒక చరిత్ర అని అన్నారు. నభూతో..నభవిష్యత్ మాదిరిగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అటు పార్టీ శ్రేణుల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ స్ఫూర్తి నింపిందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచి.. ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.
రజతోత్సవ సభ కు సంబంధించిన ప్రతి పనిని పట్టణ, మండలం, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు చాలా అద్భుతంగా చేశారన్నారు. అంతటా పార్టీ గద్దెలను నిర్మించుకొని జెండాలు ఆవిష్కరించుకోవడంతోపాటు వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్లను అతికించడం, కొందరు ప్రత్యేకంగా వాల్‌పోస్టర్ తయారు చేయించుకొని, ఫ్లెక్సీలు, బ్యానర్లు చేయించుకొని సోషల్ మీడి యా ద్వారా సభ గురించి బ్రహ్మాండంగా ప్రచారం చేశారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభను విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ ఎమ్మెల్యే పల్లా కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కేసీఆర్ పట్ల ఉన్న ప్రేమను చాటి చెప్పారన్నారు. తిరుగు ప్రయాణంలోనూ జనగామ నియోజకవర్గంలో అడుగుపెట్టిన మొదలు నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు చూపించిన ప్రేమ, ఆప్యాయత మరువరానిదంటూ స్వయంగా కేసీఆరే ప్రత్యేక అభినందనలు తెలిపారన్నారు. ఎల్కతుర్తి సభాస్థలి నుంచి ఎర్రబెల్లి వరకు వందలాది వాహనాలతో ముందుండి కేసీఆర్‌ను గమ్యస్థానానికి చేర్చిన జనగామ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 29 : కేసీఆర్ హయాంలోనే అన్ని రకాల సంక్షేమ పథకా లు ప్రజలకు అందాయని, అందుకే మళ్లీ ఆయన పాలన కోరుకుంటున్నారని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నా రు. మంగళవారం పట్టణంలో తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. ఐదు మండలాల నుంచి పదివేల మందిని తరలించాలనుకుంటే 11 వేల మంది వచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అంద డం లేదని, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
కేవలం అధికారంలోకి రావడానికే కాం గ్రెస్ అనేక హామీలిచ్చిందని, వచ్చాక ప్రజలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత అనేక ఇబ్బందులు పడుతున్నార ని, వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ గత పదేం డ్ల కాలంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తే మా యమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ పార్టీ ఒక్క పథకం కూడా పూర్తిగా ప్రజలకు అందించడంలో విఫలమైందన్నారు. ఆ పార్టీ నాయకులైన బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గురించి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఏగ్రామంలో పూర్తిగా అమలు చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపట్టి అభివృద్ధి చేస్తుందన్నారు.
రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ప్రజాప్రతినిధులు, మండల, గ్రామస్థాయి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, గోకుల రాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్‌నాయక్, నర్సిం గ్ వెంకన్న, కత్తుల ఎలేందర్, రామచంద్రూనాయక్, నవీన్ నాయక్, బొబ్బ వెంకటరెడ్డి, షరీఫ్, శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.