హనుమకొండ, మార్చి 27: ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ సరికొత్త మైలురాయిని దాటిందని సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డును సొంతం చేసుకుందన్నారు. శుక్రవారం సంస్థ పరిధిలో ఏకంగా 6574 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైందని వెల్లడించారు. గురువారం 6457 మెగావాట్ల రికార్డు డిమాండ్‌ను అధిగమిస్తూ తాజాగా 6574 మెగావాట్లకు చేరిందని తెలిపారు.
మరో 117 మెగావాట్ల అదనపు డిమాండ్‌తో సరికొత్త మైలురాయిని చేరుకున్నట్లు వరుణ్‌రెడ్డి పేరొన్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికలతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినియోగదారులకు అందించే నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ఎన్పీడీసీఎల్ సిబ్బంది నిర్విరామ కృషి, నిర్వహణ నైపుణ్యానికి తారాణమని అన్నారు. వినియోగదారులకు అందించే సేవా నాణ్యతే తమ లక్షమని, ఆ దిశగా సంస్థ నిరంతరం పనిచేస్తుందని వరుణ్‌రెడ్డి వివరించారు.