మహదేవపూర్/పలిమెల, జూలై 5 : కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌హౌస్ సందర్శనకు ఆదివారం కేటీ ఆర్ రాగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం వద్ద మాజీ స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి వాహనం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు వాగ్వాదం జరిగింది. తర్వాత ఆయన వాహనాన్ని పోలీసులు అనుమతించారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలను కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గేటు వద్దనే అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసు కుంది.
దీంతో బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు కార్యకర్తలు గేటు దూకి పంప్‌హౌస్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అకడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ప్రజాప్రతినిధులనే ప్రాజెక్టులోకి అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రా జెక్టును పరిశీలించే హకు తమకు ఉందని, గేటు వద్ద అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.