మేడారం జాతర ఆర్టీసీ పనుల్లో టెండరింగ్ నడుస్తున్నది. టెండర్లు లేకుండానే పనులు దక్కించుకునేందుకు మంత్రి అనుచరులు యత్నించారు. ఎక్కువ మంది పోటీ లేకుండా ఫోన్లు చేయడంతో పాటు ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్‌పైనా ఒత్తిడి తెచ్చారు. దీంతో గతంలో వంద మంది వరకు పోటీలో ఉండగా, ఈ సారి 68కి తగ్గింది.
– హనుమకొండ, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)
మేడారం మహాజాతర జాతర అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచా యతీరాజ్ మంత్రి సీతకకు సంబంధం లేకుండానే టెండర్ల ప్రక్రియ ముగియడంపై మంత్రుల మధ్య తీవ్ర వివాదమైంది. ఇప్పుడు ఆర్టీసీ పనులను స్థానిక మంత్రి అనుచరులు టెండర్లు లేకుండా నిర్వహిం చేందుకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. మేడారం జాతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో రూ.5 కోట్ల పనులు చేపడుతున్నారు. ప్రతి రెండేళ్ల కోసారి వచ్చే మేడారం మహాజాతర పనులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో టెండరు ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో వచ్చే జాతర కోసం బోర్డింగ్ అలైటింగ్, పారింగ్, పాయింట్ మొత్తం స్థలంలో ట్రాక్టర్ బ్రేడ్లతో చదును, రోలింగ్, రోడ్డు రిపేరు, వివిధ ప్రదేశాల్లో ప్రయాణికులకు క్యూరేలింగ్ , బుకింగ్ కౌంటర్లు, తాతాలిక షెడ్లు, బారికేడ్లు నిర్మించేందుకు, విద్యుద్దీకరణ పనులు.. ఇలా 14 వివిధ రకాల పనులకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. 68 మంది టెండర్లు వేశారు.
టెండర్లకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
టెండర్ల ప్రక్రియకు ప్రత్యేకంగా కమిటీ వేశారు. డిప్యూటీ ఆర్ఎంలు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కరీంన గర్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఇందులో ఉన్నారు. ఈ కమిటీలోని అధికారులపై మంత్రి అనుచరులు ఒత్తిడి తెచ్చారు. తమకు పోటీగా ఎవరూ టెండరు వెయ్యకుండా కాంట్రాక్టర్లను ఫోన్ చేసి గట్టిగానే చెప్పారు. సీల్డ్ కవర్ టెండర్ల ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముగియగా, మూడు గంటలకు తీశారు. గతంలో వందకు పైగా టెండర్లు వచ్చేవి. ఈసారి 68 వచ్చాయి. పనులు దకించుకున్న వారి వివరాలను ఆర్టీసీ అధికారులు బుధవారం ప్రకటించనున్నారు.
కమిటీ సమక్షంలో టెండర్లు నిర్వహించాం..
మేడారం పనుల్లో టెండర్లు వేయకుండా చాలా మంది నాపై ఒత్తిడి తెచ్చారు. 14 పనులకు 68 మంది వివిధ రకాల పనులకు టెండర్లు వేశారు. ప్రత్యేక కమిటీ డిప్యూటీ ఆర్ఎంలు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కరీంనగర్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్, అందరి సమక్షంలో మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లను తీశాం. గతం కంటే ఈసారి తకువమంది టెండర్లు వేశారు.
– డీ విజయభాను, ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్