తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థల్లో జాతీయ జెండాలు ఎగురవేశారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఉద్యమకారులను సన్మానించారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్లలో కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, అద్వైత్‌కుమార్ సింగ్, షేక్ రిజ్వాన్ బాషా, భవేశ్‌మిశ్రా, ఇలా త్రిపాఠి త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 2