పర్వతగిరి, డిసెంబర్ 20: దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మండలంలోని గోరుగుట్ట తండా, సోమారం, జమలాపురం, పర్వతగిరి గ్రామాల్లో రూ.3కోట్ల 84లక్షలతో చేపట్టిన శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, సీసీ రోడ్లు, రైతు వేదిక అభివృద్ధి పనులను మంగళవారం ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్లు వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను తెలంగా ణ ప్రభుత్వం ప్రతి ఇంటికి అందిస్తోందన్నారు.
ఎంపీపీ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, మాజీ మేడిశెట్టి రాములు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, మార్కెట్ డైరెక్టర్లు పల్లెపాటి శాంతి రతన్‌రావు, పట్టపురం ఏకాంతంగౌడ్, సర్పంచులు బానోతు వెంకన్న నాయక్, పిడుగు రేణుక, రాపాక రేణుక, మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీలు మాడ్గుల రాజు, ఏర్పుల శ్రీనివాస్, రంగు రజితా కుమార్‌గౌడ్, వెంకటరాజు, శ్యామ్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరి రవి, గోపరాజు సారయ్య, వార్డు సభ్యులు నవీన్‌గౌడ్, రజిత, సౌజన్య, యాకయ్య, సమ్మ య్య, పిడుగు స్వప్న, సాయిలు పాల్గొన్నారు.