తొర్రూరు, ఏప్రిల్ 19 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవార్డులు ఇచ్చి అభినందిస్తూనే మరో వైపు నిధులు తగ్గించి నీరుగారుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిష న్ భగీరథ శాఖ ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. తొర్రూరు మండలం నాంచామడూరు, వెలికట్ట గ్రామ పంచాయతీల్లోని నా యకులు, కార్యకర్తల ఆత్మీ య సమ్మేళనం బుధవారం తొర్రూరు రామా ఉపేందర్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ర్టానికి న్యాయపరంగా ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నిలిపివేస్తూ, ఉపాధిహామీ పథకా న్ని నీరుగార్చి కూలీల పొట్టకొట్టి, పెట్టుబడిదారుల కడుపులు నింపుతోందని మండిపడ్డారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ అభివృద్ధిలో దేశంలోనే వేగంగా దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్రం అవార్డులు ఇచ్చి అభినందిస్తున్నారే కానీ నిధులు ఇవ్వడంలేదని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీల గుర్తింపులో మన రాష్ట్రం నుంచి 13 అవార్డులు పొందగా ఇటీవల రాష్ట్రపతి చేతులమీదుగా ఢిల్లీలో అవార్డులు స్వీకరించే సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అవలంభిస్తున్న వైఖరిని వివరించినట్లు తెలిపారు.
రాష్ట్రానికి నయా పైసా ఇవ్వని బీజేపోళ్లు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. అభివృద్ధి నిరోధక బీజేపీ, కాం గ్రెస్ పార్టీల ఆగడాలను ఎండగడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని, వివక్షతను తిప్పికొట్టాలని పిలుపునిచ్చా రు. మాయమాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాల్లో రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలిచిందని ప్రశంసించారు. దేవాలయాలు, చారిత్రక ప్రదేశాల, గ్రామాల అభివృద్ధి వివరాలను తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ మంచినీరు, రిజర్వాయర్లు, చెరువులను నింపడం, ధాన్యం కొనుగోలు, ఉపా ధి హామీ వంటి పలు పథకాలు, రోడ్లు, మండల కేంద్రాల అభివృద్ధి, వివిధ పథకాలను సోదాహరణంగా వివరించారు. జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ సంపత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ లింగాల వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు.