పోచమ్మమైదాన్(కాశీబుగ్గ), డిసెంబర్ 29 : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గురువారం 3వ డివిజన్లోని ఆరెపల్లిలో రూ.85లక్షలతో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తపేటలో రూ.2 కోట్లతో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ను ప్రారంభించారు. రూ.2కోట్ల85లక్షలతో అంతర్గత పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. నిరుపేదల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ అందుతున్నాయని తెలిపారు. దేశ ప్రజలకు అండగా నిలిచేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను షీభారాణి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాకుమార్ యాదవ్, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, పండుగ రవీందర్‌రెడ్డి, ఇట్యాల సతీశ్, మెంతుర్తి కుమార్‌యాదవ్, ఆదాం, బుద్ద వెంకన్న పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక..
3వ డివిజన్లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే అరూరి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు.