పరకాల/ఆత్మకూరు, సెప్టెంబర్ 3: రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన వైఎస్ఆర్టీపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలన లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షే మం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులవుతున్న విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అందులో భాగస్వాములు అయ్యేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారి ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పార్టీలో కొత్త, పాత అనే వివ క్ష ఉండదన్నారు. పార్టీ బలోపేతానికి పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీ పరంగా పని చేసే వారికే పదవులు దక్కుతాయన్నారు. ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
సీఎం కేసీఆర్ పాలనను ఇంటింటికీ తిరి గి వివరించాలని సూచించారు. సీఎం కేసీఆర్ పదికాలాల పాటు అధికారంలో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ప్రజలను విపక్షాలు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. వారి కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నా రు. కాగా, పార్టీలో చేరిన వారిలో ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వైఎస్ఆర్టీపీ ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షుడు జన్నారపు మహేశ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ దండు సుధాకర్, నడికూడ యూత్ అధ్యక్షుడు అనిల్, పరకాల టౌన్ అధ్యక్షుడు బాలకృష్ణ, కార్యదర్శి బీష్మాచారి, ప్రధాన కార్యదర్శి చుక్క సదయ్య, జలుగూరి రమేశ్, చుక్క రవి, అర్షం లక్ష్మీనారాయణ, రాంచరణ విన య్, నరేశ్, మహేశ్, వంశీకుమార్, కురున్ ప్రసాద్, కృపాకర్, జన్నారపు కట్టయ్య, సాంబయ్య, అరవింద్, రా జేందర్, రాజు, మల్లికార్జున్, రాజు ఉ న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, దళితబంధు పట్టణ కన్వీనర్ సోదా రామకష్ణ, పరకాల వైస్ ఎంపీపీ, మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నా యకులు జిన్నా రామకృష్ణారెడ్డి, రేవూరి ప్రవీణ్‌రెడ్డి, భాషబోయిన పైడి, భాషబోయిన సదానందం పాల్గొన్నారు.
బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిక
ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామానికి చెందిన బీజేపీ అధ్యక్షుడు నాంపెల్లి రమేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో గ్రామ యూత్ అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, యూత్ నాయకులు తోట కిరణ్, గంగుల అనిల్, వంశీయాదవ్, కిశోర్‌తో పాటు 20 మంది ఉన్నా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంగాల భగవాన్‌రెడ్డి, పాపని రవీందర్, ఎండీ అంకూస్ పాల్గొన్నారు.