నర్సంపేట రూరల్, డిసెంబర్ 3 : నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట నియోజకవర్గంలోని 17 మందికి రూ.25లక్షల 50వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 8 మంది రైతు కుటుంబాలకు రూ.40లక్షల విలువైన రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు. రాష్ట్రంలోనే సీఎంఆర్ఎఫ్ మంజూరులో నర్సంపేట నియోజకవర్గం 3వ స్థానంలో ఉందన్నారు. రైతు బీమా పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకున్నదని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీ నాయక్, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా దివ్యాంగుల దినోత్సవం..
నర్సంపేట పట్టణంలోని క్యాంప్ కార్యాలయం లో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఎమ్మెల్యే పెద్ది కేక్ కట్ చేశారు. దివ్యాంగులకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో దివ్యాంగుల శాఖ స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో కలిపి ఉండేదని, దివ్యాంగులకు మరింత సేవలందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ శాఖను దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖగా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేయడం హర్షించదగిన విషయమన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నియోజకవర్గ నాయకులు నూకల కృష్ణమూర్తి, ఆబోత్ రాజుయాదవ్, పుప్పాల రజిత, కోగంటి ప్రభాకర్, బండారు శైలజ, రామగిరి రజిత, లింగాల శంకర్, మర్రి స్వామి, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్పస్వామి దేవాలయంలో..
పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయలో నూతనంగా నిర్మించిన వంటశాల భవనాన్ని ఎమ్మెల్యే పెద్ది ప్రారంభించారు. దేవాలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, వెంకటేశ్ శర్మ, గురుస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, అయ్యప్పస్వామి దేవాలయంలో వెంకటేశ్ శర్మ ఆధ్వర్యంలో పడి పూజ వైభవంగా జరిగింది. ఆలయ పూజారులు దేవేశ్ మిశ్రా, శ్రీమాన్ నిరాకార్ సాహు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు..
దుగ్గొండి : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే పెద్ది నాయకులకు సూచించారు. మండలంలోని చలపర్తి గ్రామ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎస్సై వంగల నవీన్‌కుమార్, సర్పంచ్ ముదురుకోళ శారదాకృష్ణా, గ్రామ అధ్యక్షుడు పోలోజు లక్ష్మణాచారి, ప్రధాన కార్యదర్శి దండు రాజు, యూత్ అధ్యక్షుడు బోశెట్టి రంజిత్‌కుమార్, సొసైటీ డైరెక్టర్ అంకేశ్వరపు జ్యోతీనర్సింహస్వామి, వార్డు సభ్యులు దూలం రజిత, సుధారామకృష్ణ, కొండ్లె రవి, అనిల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.