నల్లబెల్లి, మే 31 : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరపాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం మండల పార్టీ కార్యాలయంలో జూన్ 2న ఉదయం 8 గంటలకు జాతీయ జెండా, పార్టీ పతాకాన్ని ఎగురవేయడం జరుగుతుందని తెలిపారు.
ఇట్టి కార్యక్రమానికి మండలంలోని పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ ఇన్చార్జీలు, మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యమకారులు , ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన సంఘ నాయకులతో పాటు పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని, రాష్ట్ర అవతరణ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి నేతృత్వంలో పార్టీ శ్రేణులను సంఘటితం చేయాలని సూచించారు.