మహాముత్తారం, సెప్టెంబర్ 11 : సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సీఆర్పీలే ఆ పాఠశాల విద్యార్థులకు దిక్కయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులున్నారు.
ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఇక్కడి ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. ఇక్కడ ఎవరినీ నియమించకపోవడంతో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఆర్పీలు స్కూల్కు వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. అధికారులు వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.