లింగాలఘనపురం, మార్చి 2 : స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆదివారం ఎర్రవెల్లిలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక తప్పనిసరి అని, నువ్వు ఎమ్మెల్యే కావడం ఖాయమని కేసీఆర్ ఆశీర్వదించారని రాజయ్య తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల పక్షాన నిలువాలని అలాగే బీఆర్ఎస్ కేడర్‌ను, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తూ ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని కేసీఆర్ రాజయ్యకు సూచించారు.