హనుమకొండ, ఆగస్టు 1 : నైతికత ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తున్నదన్నారు. ఈ చట్టం, రాజ్యాంగంపై స్పీకర్‌కు గౌరవం ఉంటే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హ త వేటు వేయాలన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీ
ఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ శాసన సభ స్పీకర్‌ను ఆదేశించిందన్నారు. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడంతో పాటు చారిత్రాత్మక తీర్పు వెలువరించిందన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సభ్య త్వం వెంటనే రద్దయ్యేలా చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం తీర్పు వెలువడగానే పా ర్టీ మారిన కాంగ్రెస్ నాయకులు పండుగ చేసుకుంటున్నారని, అంటే స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోరా? అని ప్రశ్నించారు. ప్రజలకు సీఎం రేవంత్‌రె డ్డి ముఖం చూపించలేక మీనాక్షి నటరాజన్‌తో పాదయాత్ర చేయిస్తున్నారని, ఇలాంటి వ్యవహారం చరిత్రలో ఎప్పుడైనా ఉందా? అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతుల్లో అధిష్టా నం తెలంగాణ రిమోట్ కంట్రోల్ పెట్టిందన్నారు. సమాంతర సీఎంగా మీనాక్షి నటరాజన్ మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణలో ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, సెక్రటేరియట్లో అధికార యంత్రాంగం, మంత్రులతో సమీక్షలు ఎలా జరుపుతారం టూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి డమ్మీ సీఎం అని లీడర్, క్యాడర్‌కు తెలిసిపోయిందన్నా రు.
మీనాక్షి డైరెక్షన్లోనే రాష్ట్ర పాలన నడుస్తుండగా, రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీలో తనకేదో పలుకుబడి ఉన్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చ ర్యలకు పూనుకుంటున్నదని ఆగ్రహం వ్య క్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నార ని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తారని రవీందర్రావు పేర్కొన్నారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ రమేశ్, నాయకులు రవీందర్రావు, నయీముద్దీన్, మిట్టపల్లి రమేశ్, రజినీకుమార్, రామ్మూర్తి, వీరేందర్, బుద్దె వెంకన్న, మహేందర్ పాల్గొన్నారు.