Paddy | తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్కు చెందిన రామేల్ల లాలయ్య అనే రైతు తన ఏడెకరాల వరి కోతకోసి నెల దాటింది. కొనుగోలు కేంద్రంకు తరలించే స్థోమత లేక పొలంలోనే కళ్ళం వేసుకున్నాడు. కొనుగోలు చేయమని అధికారులను వేడుకున్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నాడు. కురిసిన అకాల వర్షాలకు తడిసి ముద్దై దెబ్బతిన్న ధాన్యాన్ని తొలగించగా మిగిలిన ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేయడంతో మొలకలొచ్చాయని కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పటికైన ధాన్యాన్ని కొనుగోలు చేసి తనను ఆదుకోకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని రైతు లాలయ్య బోరుమన్నాడు. దేశానికి అన్నం పెట్టె రైతును ఏడిపించిన ఏ ప్రభుత్వం ఎదగలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డాడు.