కేసముద్రం, నవంబర్ 21: నాణ్యమైన భోజనం అందించాలని కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ ఎదుట డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. బాలబాలికలు పస్తులు ఉండడానికి గల కారకులైన ఎస్వో, జీసీడీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్ మాట్లాడుతూ వసతి గృహాల సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేశారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన నిత్యావసర వస్తువులనే వంట చేయడానికి ఉపయోగించడం బాధాకరమన్నారు. రాత్రి సమయంలో కేర్‌టేకర్, నైట్ వాచ్మెన్ ఎవరూ లేకుం డా విద్యార్థినులను ఒంటరిగా వదిలేయడం సరైంది కాదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై క్రాంతి కిరణ్ విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులతో మాట్లాడి శాంతింపజేశారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. భువన్, రాజు, రవి ఉన్నారు.