ఖిలావరంగల్, మార్చి 29: విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ సూచించారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఫలితాలను మంగళవారం అదనపు కలెక్టర్ డీఈవో వాసంతితో కలిసి విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో కూడా ఎగ్జిబిట్లను ప్రదర్శించి జిల్లాకు పేరుప్రతిష్టలు తేవాలన్నారు. డీఈవో మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాలతో జీవన ప్రమాణాలు ముడిపడి ఉంటాయన్నారు. శాస్త్రీయ దృక్పథం ఉన్న బాల మేథావులను బయటకు తెచ్చేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడుతాయని వివరినంచారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలకు 157 మంది నమోదు చేసుకున్నారన్నారు. ఈ నెల 28న న్యాయ నిర్ణేతలు పరిశీలించి ప్రతి విభాగంలో ఉత్తమమైన మూడు ఎగ్జిబిట్లను ఎంపిక చేశారన్నారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు మాత్రమే రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొంటారన్నారు.
‘పర్యావరణ అనుకూల పదార్థాలు’ అంశంలో సంగెం మండలం మొండ్రాయి జడ్పీఎస్ఎస్ 6వ తరగతి విద్యార్థి ప్రణయ్వర్ధన్ ప్రథమ స్థానం, వరంగల్ మండలం నరేంద్రనగర్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి బీ అక్షిత ద్వితీయ స్థానం, చెన్నారావుపేట మండలం సిద్ధార్థ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి బీ మానస తృతీయ స్థానం, రాయపర్తి మండలం తిరుమలయపల్లి జడ్పీఎస్ఎస్ 6వ తరగతి విద్యార్థి జీ అలేఖ్య కన్సోలేషన్ బహుమతి గెలుచుకున్నారు. అలాగే, ‘ఆరోగ్యం, పరిశుభ్రత’ అంశంపై గీసుగొండ మండలం ధర్మారం జడ్పీఎస్ఎస్ 10వ తరగతి విద్యార్థి జీ వివేక్ ప్రథమ స్థానం, వరంగల్ మండలం లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి ఆర్ కోటేశ్వర్ ద్వితీయ స్థానం, సంగెం మండలం గవిచర్ల టీఎస్ఎంఎస్ 8వ తరగతి విద్యార్థిని ఎం జ్యోతిలక్ష్మి తృతీయ స్థానం, నర్సంపేట మండలం గీతాంజలి స్కూల్ 9వ తరగతి విద్యార్థి ఎండీ షాగుప్తా కన్సోలేషన్, ‘సాఫ్ట్వేర్ యాప్స్’ అంశంపై వరంగల్ నరేంద్రనగర్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి సీహెచ్ కార్తీక్ మొదటి స్థానం, నర్సంపేట గీతాంజలి స్కూల్ 9వ తరగతి విద్యార్థి కే రాంచరణ్ ద్వితీయ స్థానం, పరకాల జడ్పీఎస్ఎస్ 9వ తరగతి విద్యార్థి ఎండీ మున్నా తృతీయ స్థానంలో నిలిచారు. రవాణా అంశంపై నర్సంపేట గీతాంజలి ఇంగ్లిష్ మీడియం 9వ తరగతి విద్యార్థి కే ప్రవీణ్ ప్రథమ స్థానం, రాయపర్తి మండలం కేశవాపూర్ జడ్పీఎస్ఎస్ 8వ తరగతి విద్యార్థి జీ నవీన్ ద్వితీయ స్థానం, వరంగల్ రిషి స్కూల్ 9వ తరగతి విద్యార్థిని అస్ముల్లా తృతీయ స్థానం, పర్యావరణం, వాతావరణ మార్పులు అంశంపై దుగ్గొండి మండలం తొగర్రాయి జీడ్పీహెచ్ఎస్ 9వ తరగతి విద్యార్థి కే సందీప్ ప్రథమస్థానం, సంగెం మొండ్రాయి ఉన్నత పాఠశాల విద్యార్థి బీ శ్రీనిక ద్వితీయ స్థానం, ఖానాపురం మండలం బుధరావుపేట జడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదువుతున్న సింధూజ తృతీయ స్థానంలో నిలిచారు.