హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 2: హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని మంత్రి ఇంటి గేటు ముందు కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది.
విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో ఎకించి సుబేదారి పోలీస్స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్సీయూ విద్యార్థుల పట్ల కరశంగా, అత్యంత పాశవి కంగా వ్యవహరిస్తూ అక్రమంగా లాఠీచార్జికి పాల్పడిందన్నారు.
బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూములను కార్పొరేట్, పెట్టుబడిదా రులకు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, లేకుంటే ప్రభుత్వానికి పతనం తప్పదని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బీ నర సింహారావు, మొగిలి వెంకట్రెడ్డి, మర్రి మహేశ్(పీడీఎస్యూ), భాషబోయిన సంతోష్ (ఏఐఎస్ఎఫ్), కే శ్రావణ్ (డీఎస్ఏ), మాలోత్ రాజేశ్ (యూఎస్ఎఫ్ఐ), మంద నరేశ్ (ఏబీఎస్ఫ్), ఎల్తూరి సాయికుమార్(ఎస్ఎస్యూ), కుమ్మరి శ్రీనాథ్ (ఎంఎస్ ఎఫ్), శివ నాస్తిక్ (బీఎస్ఎఫ్) తదితరులు పాల్గొన్నారు.