NEET Paper Leak | నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
NEET Paper Leak | నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా : దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన నీట్ ప్రశ్నాపత్రం (NEET Question ) లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ ( Iinquiry ) జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న లోపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కివేయడం రాజకీయాలు కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడమే ప్రభుత్వ ధర్మమమన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే విధంగా వ్యవహరించాలని సూచించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను మరింత పటిష్టం చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేలా ఎన్టీఏ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన రద్దు చేస్తూ యూపీఎస్సీ లాంటి స్వయం ప్రతిపత్తిగల కేంద్రస్థాయి సంస్థను నీట్ ప్రవేశ పరీక్షకు నిర్వహించే బాధ్యతను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొణతం కృష్ణ, బెనర్జీ, దారం జనార్ధన్, ధనలక్ష్మి, దేవిక, అంజయ్య, కొలిపాక ప్రకాష్, నగేష్, దొమ్మటి ప్రవీణ్‌కుమార్, రవితేజ, నిరంజన్, రాష్ర్ట పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

