వరంగల్ చౌరస్తా, ఆగస్టు 10: పసికందు ఘట న నేపథ్యంలో ఎంజీఎం దవాఖానలో సంచరిస్తు న్న వీధికుక్కలను శనివారం మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు.
శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న ఘ టన వెలుగులోకి రావడంతో శనివారం మంత్రి కొండా సురేఖ స్పందించి మున్సిపల్ అధికారుల ను ఆదేశించారు. ఈ మేరకు జీడబ్ల్యూఎంసీ సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్ ఆధ్వర్యంలో 12 కుక్కలను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించారు.