లింగాల ఘనపురం : నకిలీ విత్తనాలు ఎవరు విక్రయించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీం శర్మ హెచ్చరించారు. మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో ఉన్న బిల్ బుక్స్‌ను, స్టాక్ రిజిస్టర్లతో పాటు నిల్వ ఉన్న విత్తనాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆమోదం తెలిపిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలన్నారు. రైతులు కూడా తాము తీసుకున్న విత్తనాలకు, ఎరువులకు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట సిఐ శ్రీనివాస్ రెడ్డి. ఎస్సై శ్రావణ్ కుమార్, ఏవో వెంకటేశ్వర్లు తదితరులున్నారు.