పెద్దవంగర, మే 26: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రంలోని సాయిగార్డెన్స్‌లో బొమ్మకల్లు, చిట్యాల, పోచంపల్లిలో గంట్లకుంట, పోచంపల్లి, అవుతాపురం, ఉప్పరగూడెం గ్రామాల నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. పార్టీయే బలం.. కార్యకర్తలే నా బలగం.. పార్టీని తల్లిలా చూసుకోవాలె.. మనమంతా పిల్లలం.. మనలో కొద్దిపా టి తేడాలుంటే సర్దుకుపోవాలి.. సమస్యలేమైనా ఉంటే పకన పెడదాం.. అంతా కలిసికట్టుగా ఉండాలి.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం. ఇంకా చేయాల్సిందేమైనా ఉంటే చేసుకుందాం. అంతా ఆత్మీయంగా ఉందాం’ అని బీఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ లాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని, 80లక్షల మంది బలగం అన్నారు. కార్యకర్త ఏ కారణం చేతనైనా చనిపోయినా, వారి పేరున బీమా పార్టీయే కట్టి రూ.2లక్షల ఇస్తున్న పార్టీ దేశంలో ఎకడా లేదన్నారు. పార్టీని నమ్ముకున్న మనందరికీ ఎప్పటికీ మంచే జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్, మం త్రి కేటీఆర్ పార్టీకి అండగా ఉన్నంత కాలం మనమంతా బాగుంటామని, మనకు చిన్నచిన్న సమస్యలుంటే పకన పెట్టి అన్నదమ్ములోలే కలిసికట్టుగా ఉం దామని ఉద్బోధించారు. మీ అందరి దయవల్ల పాలకుర్తి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, సీఎం కేసీఆర్ నన్ను మంత్రిని చేశారని, మంచి పోర్టు పోలియో ఇచ్చారన్నారు. అందరికీ నీళ్లు ఇచ్చే, గ్రామాలను అభివృద్ధి చేసే, ఉపాధి హామీ కి, మహిళల మంత్రిని నేనేనని, ఇన్ని ముఖ్యమైన శాఖలతో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సీఎంఇచ్చారని పేర్కొన్నారు.
పాత గ్రామ పంచాయతీలే కాకుండా, కొత్తగా ఏర్పడిన 3,146 జీపీలకు రూ. కోటిన్నర నుంచి రూ. 2.5 కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. అన్ని గ్రామాలకు అంతర్గత రోడ్లు, గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్లు, ఉన్న రోడ్లను డబుల్‌గా మార్చానని, ప్రతి గ్రామంలో చెరువులను బాగు చేసి, సీఎం కేసీఆర్ దయతో కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని చెరువులను నింపినట్లు వివరించారు. నేడు రెండు పంటలు పండడానికి కారణం ముఖ్యమంత్రి అని వివరించారు. కరోనా కష్ట కాలంలోనూ నిరుపేదలను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ అని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో దేశానికే తెలంగాణ గ్రామాలు ఆదర్శంగా నిలిచి అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయని, ఇవి మన ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అని అన్నారు. స్థానిక సంస్థల చరిత్రలో ఈసారి వచ్చినన్ని నిధులు ఎప్పుడూ రాలేదని, సీఎం కేసీఆర్ దూర దృష్టితో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు అందాయన్నారు. తకువ జనాభా ఉన్న గ్రామానికి కూడా రూ.5లక్షలకూ తగ్గకుండా నిధులు అందుతున్నాయని, ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల శాశ్వత ప్రాతిపదికన పనులు జరిగాయన్నారు.
గ్రామాల్లో మహిళలు, యువత అభివృద్ధి కోసం పనులు చేపట్టాలనే లక్ష్యంతో మహిళలకు ఉచిత ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరికే విధంగా కుట్టు మిషన్ల శిక్షణ, మిషన్ల పంపిణీ చేపట్టానన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం నా విధిగా పని చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌లోని టెక్స్ టైల్ పార్కు బస్సులు ఏర్పాటు చేసి, నియోజకవర్గ మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చేస్తామన్నారు. యువత కోసం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దకేవిధంగా ఉచిత శిక్షణ, జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం అభివృద్ధికి సంబంధించిన వివరాలపై ముఖ్య నాయకులు కార్యకర్తలు ద్వారా మాట్లాడి చర్చించారు. ఆయా గ్రామాల ప్రజలు, కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అకడికకడే మంత్రి పరిషరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటి విషయాలపై చర్చించారు.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని, ఎర్రబెల్లి దయాకర్‌రావు రూపంలో మీకు మంచి ఎమ్మెల్యే దొరికారని, నిరంతరం మీ గురించి మీ ప్రాంత అభివృద్ధి గురించే ఆలోచిస్తారని, ఎర్రబెల్లి ఎకడ ఉంటే, అకడ అభివృద్ధిలో పరుగులు ఉన్నట్లే. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో పని చేస్తూ దేశంలోనే ఉత్తమ మంత్రిగా నిలిచారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచి, అభివృద్ధి, సంక్షేమాల్లో ముందున్నదని, తెలంగాణను చూసి దేశం నేర్చుకుంటున్నదని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించుకున్నా, ముఖ్యమంత్రి ఇంతగా అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూస్తుంటే ప్రతిపక్షాల్లో వణుకు పుడుతున్నదని, నిలబడితే డిపాజిట్ రాదనే భయంతో ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు, ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, జిల్లా నాయకులు నెహ్రూనాయక్, కిశోర్‌రెడ్డి, పాలకుర్తి దేవస్థానం, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, మాజీ మండల అధ్యక్షుడు పీ యాదగిరిరావు, నాయకులు సోమనర్సింహారెడ్డి, సుధీర్‌కుమార్, శ్రీనివాస్, సుధాకర్, మనోహర్‌గౌడ్, సోమన్ననాయక్, జ్ఞానేశ్వరాచారి, మల్లికార్జునాచారి, రాజుయాదవ్, సమ్మయ్య, రహీముద్దీన్, యూత్ మండల అధ్యక్షుడు హరీశ్‌యాదవ్, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, దీపికారెడ్డి, భాస్కర్‌రావు, మంజుల, కరుణ, జమున, పటేల్నాయక్, రాజేందర్‌నాయక్, ఎంపీటీసీలు రవీందర్‌నాయక్, శ్రీనివాస్, అనురాధ, కల్పనాయాదవ్, విజయ, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత విభాగం, రైతుబంధు సమితి బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులు పాల్గొన్నారు.