మడికొండ, జూలై 11: మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు కొనసాగే 10వ రాష్ట్రస్థాయి నేత్ర వైద్య నిపుణుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది నేత్ర వైద్య నిపుణులు హాజరు కావడంతో పాటు వివిధ ఫార్మా కంపెనీలు శస్త్ర పరికరాలు కంపెనీలు పాల్గొన్నాయి. సదస్సులో భాగంగా వైద్యుల అనుభవాలను, నూతన వైద్య పద్ధతులను పంచుకున్నారు.
అనంతరం నూతన రాష్ట్ర కార్యవర్గ బాధ్యతలను వరంగల్‌కు చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కేశరాజు విజయ్ కుమార్ స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డాక్టర్ భరత్ కుమార్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఐత రాజ రవీంద్ర, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ పరమేశ్వర రావు, నేత్ర వైద్య నిపుణులు రాజలింగం, రిషి స్వరూప్, బద్రి నారాయణ, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.