రాయపర్తి : మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందంతో కలిసి బుధవారం పరామర్శించారు. మండలంలోని కొండూరుకు చెందిన గిరికత్తుల లక్ష్మయ్య, కొలనుపల్లి గ్రామానికి చెందిన నాగాండ్ల వెంకన్న ఇటీవల పలు కారణాలతో మృతి చెందారు. కుటుంబ యజమానుల అకాల మరణాలతో శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ఎస్ఆర్ఆర్ ప్రతినిధి లేతాకుల రంగారెడ్డి సారధ్యంలో కలసి పరామర్శించడంతోపాటు మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఇరు కుటుంబాలకు తల 50 కేజీల బియ్యం, వంటనూనె, నిత్యావసర వస్తువులను అందజేశారు. అనంతరం లేతాకుల రంగారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. మృతుల కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నిత్యం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు పూస మధు, కొలనుపల్లి సొసైటీ వైస్ చైర్మన్ చిట్యాల వెంకటేశ్వర్లు, వంగాల నరసయ్య, తోట నర్సింగం, దేశబోయిన ఉపేందర్, పులి సోమయ్య గౌడ్, కొమ్మురాజు, మహేష్, రాములు, కుమార్, అంజయ్య, సోమునారి, యాదగిరి, యోగానందు, సోమయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.