Sports School Selections | హనుమకొండ చౌరస్తా, జూన్ 28: హనుమకొండ డిఎస్ఏ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ స్కూల్స్‌కు సెలక్షన్స్ ముగిసాయి. హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ కోసం హనుమకొండ జిల్లాస్థాయి సెలక్షన్స్‌ను శనివారం హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి గుగులోతు అశోక్‌కుమార్ జేఎన్ఎస్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ సెలక్షన్స్ గతంలో రెండు రోజులపాటు నిర్వహించామని అలాగే ఆన్లైన్లో నమోదు చేసుకొని వారికి మరో అవకాశం కల్పించాలని సాట్ ఆదేశాల మేరకు శనివారం మరో అవకాశం కల్పించామని తెలిపారు.
ఈ మూడు రోజుపాటు జరిగిన జిల్లాస్థాయి సెలక్షన్లో హనుమకొండ జిల్లాలోని వివిధ మండలం నుంచి 21 మంది క్రీడాకారులు హాజరయ్యారని, ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి హకీంపేట్‌లో జరిగే రాష్ర్టస్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ సెలక్షన్స్‌కు పంపుతామని అశోక్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్‌లు, పీడీలు, సిబ్బంది పాల్గొన్నారు.