కాజీపేట, జూన్ 24 : తిరుమల-తిరుపతి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కాజీపేట మీదుగా పలు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-తిరుపతి- చర్లపల్లి మద్య ఈ నెల 25 నుంచి 28 వరకు నాలుగు స్పెషల్ సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు. ఈ రైళ్లు 07819 నంబర్‌తో చర్లపల్లి నుంచి 25, 27 తేదీల్లో (గురు, శనివారం) సాయంత్రం 6.10 గంటలకు బయలు దేరి మరుపటి రోజు ఉదయం 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 07820 నంబర్‌తో 26, 28 తేదీల్లో(శుక్ర, ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.30గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయి. ఇవి జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.