కాజీపేట, ఫిబ్రవరి 5 : అయోధ్య బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మంగళవారం కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఈ రైలు బయలుదేరనున్నది.
గత నెల 30న బయలు దేరాల్సిన ఆస్తా ప్రత్యేక రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేశారు. మళ్లీ ఈ రైలును పాత ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకారం నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.