జనగామ రూరల్, జూన్24: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు జనగాం మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షురాలు బొల్లం శారద తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
జనగామ ప్రజల ఆశీర్వాదంతో త్వరగా కోలుకొని ప్రజాజీవనంలోకి వచ్చి మరెందరికో తోడ్పాటు అందిస్తూ ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సానబోయిన శ్రీనివాస్, ఇట్టబోయిన శ్రీనివాస్, గండి ప్రవీణ్ కుమార్, బానోత్ జయరాం, లచ్చిరాం నాయక్, కృష్ణారెడ్డి, వజ్యపరిషరాములు తదితరులు ఉన్నారు.