కృష్ణకాలనీ, డిసెంబర్ 15 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలివ్వాలని అడిగిన నిరుపేదలను అరెస్ట్ చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన? అంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఇండ్లు లేని పేదలుండొద్దనే లక్ష్యంతో తమ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి 392 మందికి కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. గత 22 రోజులుగా భూపాలపల్లి 11వ వార్డు భాస్కర్గడ్డలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద పట్టాల కోసం నిరసన తెలుపుతున్న లబ్ధిదారులకు ఆదివారం గండ్ర సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ 14 నెలల క్రితం లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లు నేటికీ గృహ ప్రవేశాలకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న లబ్ధిదారుల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోవడం బాధాకరమన్నారు. రెండు రోజుల క్రి తం తాను ఇకడికి వచ్చి లబ్ధిదారులను పరామర్శించడంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరడంతో సానుకూలంగా స్పందించారన్నారు. శనివారం మంత్రులు శ్రీధర్‌బాబు, రాజనర్సింహ భూపాలపల్లి జిల్లాలో పర్యటించినా డబుల్ బెడ్రూం ఇళ్ల విషయమై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.
పైగా లబ్ధిదారులు త మ గోడును మంత్రులకు చె ప్పుకోవడానికి వస్తే, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పోలీసులతో అడ్డుకొని, అరెస్టులు చేయించ డం సరైంది కా దన్నారు. కాం గ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పట్టాలివ్వడంలో ఎమ్మెల్యే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గూడు లేని పేదలను ఇబ్బంది పెడితే వాళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్ప క తాకుతుందన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ 392 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పేదల పక్షాన ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతానని గండ్ర హెచ్చరించారు. ఆయన వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, అర్బన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, కౌన్సిలర్లు మేకల రజిత, ఎడ్ల మౌనిక, ఆకుదారి మమత, బానోత్ రజిత, జకం రవికుమార్, మంగళపల్లి తిరుపతి, ముంజంపల్లి మురళీధర్, కో ఆప్షన్ మెంబర్ బేతోజు వజ్రమణి, బీబీ చారి, జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, నాయకులు బండారి రవి, సింగనవేణి చిరంజీవి, జోరు ఈశ్వర్, కుమార్ యాదవ్, పోలవేణి ప్రసాద్, ఎండీ కరీం, రాజు, వేణు, శ్రీ కాంత్ పటేల్, రాకేశ్, స్వప్న పాల్గొన్నారు.