కేసముద్రం, సెప్టెంబర్ 26 : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే తన ఇద్దరు బిడ్డలను పొట్టన బెట్టుకుంది. ఒకరిని నీటి సంపులో పడేయగా, మరొకరిని ఉరి వేసి చంపింది. రూరల్ సీఐ సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్ నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన శిరీషను ఏడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గు రు కుమారులు మనీష్‌కుమార్(6), మోక్షిత్, నిహాల్ (లేట్) జన్మించారు. ఉపేందర్ డ్రైవర్‌గా పనిచే స్తుండగా, శిరీష ఇంటి వద్దనే ఉంటున్నది. నిహాల్ రెండు సార్లు నీటి సంపులో పడి ప్రాణాలతో బయట పడ్డాడు.
ఈ ఏడాది జనవరి 15న నిహాల్ నీటి సంపులో పడి మృతి చెందినట్లు శిరీష అందరినీ నమ్మించింది. జూలై 31న మనీష్‌కుమార్‌ను చంపాలనుకొని కత్తితో మెడపై దాడి చేయగా ప్రాణాలతో బయట పడ్డాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడని తెలిపింది. ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమ యంలో మనీష్‌కుమార్ నోట్లో లడ్డూలు కుక్కి ఊపిరి ఆడకుంటా చేసి మెడకు తాడు వేసి ఉరిపెట్టింది. తనపై అనుమానం రాకుండా ఇంటి సమీపంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడింది. తన కొడుకు మనీష్‌కు జ్వరం వస్తుందని, పడుకున్నాడని వారికి చెప్పి నమ్మించింది. నాయినమ్మ మంగమ్మ కూలికిపోయి వచ్చిన తర్వాత చూడగా మనీష్ కుమార్ మృతి చెంది ఉన్నాడు. మెడ చుట్టూ కమిలి ఉండడంతో పోలీసులకు సమచారం అందించారు. పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు శిరీ ష, ఉపేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపానని తల్లి శిరీష ఒప్పుకున్నది.
భర్త ఉపేందర్ వివాహేతర సంబంధం కలిగి ఉండి తనని పట్టించుకోవడం లేదనే అనుమానంతో తనను, పిల్లలను చూసుకోడని భా వించి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ముందుగా ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఇబ్బందులు పడుతారని, వారి చంపిన తరువా త తాను ఆత్మహత్య చేసుకోవాలని శిరీష ఇద్దరి కొడుకులను చం పింది. పోలీసులు కేసు నమోదు చేసి శిరీషను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలి పారు. 9 నెలల క్రితం భూమిలో పూడ్చిన నిహాల్ మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన వెంట ఎస్సై మురళీధర్‌రాజ్ , సిబ్బంది ఉన్నారు.