ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని 44వ డివిజన్ సింగారం గ్రామానికి చెందిన సింగారపు రాజు(అంబేద్కర్ రాజు) దళిత బహుజనుల సమస్యల పై నిరంతం పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు. సింగారపు రాజు 2000 సంత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల అనేక సమస్యలు హక్కుల కోసం అలాగే పేదల సంక్షేమం కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారు. ఆయన చేసిన సేవలను, కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్డుతో సత్కరించింది. అవార్డును డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబుజగ్జీవన్ రామం జయంతి ఉత్సవాల కమిటీ రవీంద్ర భారతి అందజేశారు.
ఈ మేరకు మంత్రి కొండ సురేశ్ క్యాంప్ కార్యాలయంలో సురేశ్ చేతుల మీదుగా గురువారం అందుకున్నుట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా రాజు మట్లాడుతూ.. అవార్డు రావడానికి సహకరించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు అందుకున్న రాజును ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర నాయకులు రమేశ్, జిల్లా నాయకులు రవి, వెంకటేశ్వర్లు, మిత్రులు సింగారపు యాకయ్య ప్రసాద్, మధుకర్, శ్రీకాంత్, గౌస్మయాలు అభినందించారు.