చేర్యాల, జూన్ 30 : సమాజంలోని ప్రతి ఒక్కరు పౌర హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ నరేష్, ఆర్ఐ అయిలయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల పై ప్రజలకు పోలీస్, రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు.
అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ పౌరుల హక్కులకు భంగం కలిగించడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరు ఇతరుల హక్కులకు భంగం కలించకుండా వారి రోజు వారి పనులను చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.