బచ్చన్నపేట, సెప్టెంబర్ 11 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన గడ్డల శోభ అనారోగ్యంతో నీలిమ దవాఖానలో చేరింది. విషయం తెలుసుకొని గురువారం బీఆర్ఎస్ నేత, సామజిక కార్యకర్త కోడూరు శివకుమార్ గౌడ్ పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు.
అనంతరం వైద్య ఖర్చులకుగాను ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటానని అన్నారు.అతని తోపాటు మల్గ అనిల్, చల్ల మంజరేకర్, మైల వెంకటేష్, తదితరులు ఉన్నారు.