హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 5: కాకతీయ విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగ పాఠ్యప్రణాళిక అధ్యక్షురాలిగా జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ జి.షమితాను రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్‌రెడ్డి ఆమోదంతో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. షమితా ప్రస్తుత పాఠ్యప్రణాళిక అధ్యక్షులు ప్రొఫెసర్ ఈసం నారాయణ నుంచి శుక్రవారం బాధ్యతలు నేడు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు షమితాను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
IndiGo Airlines | ఇండిగోపై నటి మెహ్రీన్ పిర్జాదా తీవ్ర ఆగ్రహం.. ‘నష్టపరిహారం చెల్లించండి!’
Traffic Jam | రోడ్డెక్కితే చుక్కలే!.. హైదరాబాద్‌లో అడుగడుగునా ట్రాఫిక్ జామ్