IndiGo | నిర్వహణపరమైన లోపాల వల్ల దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో (IndiGo) విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోన్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది (IndiGo Flight Cancellations). గురువారం ఒక్కరోజే ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశ వ్యాప్తంగా 550 విమానాలు రద్దయ్యాయి. ఇక వరుసగా నాలుగోరోజైన శుక్రవారం కూడా ఈ పరిస్థితి కొనసాగింది. దాదాపు 400 విమానాలు రద్దయ్యాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులకు పడిగాపులు తప్పలేదు. ఫలితంగా విమానాశ్రయాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ విషయంపై నటి మెహ్రీన్ పిర్జాదా అసహనం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఇండిగో సంస్థ సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
“నరకానికి పో ఇండిగో. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మీ యాప్ విమానాలు ‘సమయానికి’ ఉన్నాయని చూపిస్తూ, ప్రయాణికులు విమానం ఎక్కే చివరి క్షణంలో రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు రోజుల తరబడి విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇది సాంకేతిక లోపం కాదు, ఇది నిర్లక్ష్యం!. కొత్త డీజీసీఏ (DGCA) నియమాలు అమల్లో ఉన్నప్పటికీ, మీరు కస్టమర్లను తప్పుదోవ పట్టించే బదులు, మీ షెడ్యూళ్లను సరిదిద్దుకోవాల్సింది. మీరు సృష్టించిన ఈ గందరగోళం దారుణం. తప్పును అంగీకరించండి, ఏం జరుగుతుందో వివరించండి, మరియు చిక్కుకుపోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించండి.
Go to hell @IndiGo6E ! This is absolutely unacceptable. Passengers have been stuck at airports for days while your app keeps showing flights as “on time” until the moment you cancel them at the time of boarding. This isn’t a glitch — it’s negligence.
With new DGCA rules in place,…— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) December 5, 2025