బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ వాయిస్ నోట్ ద్వారా పదికోట్లు డిమాండ్ చేశారని ముంబయ్ పోలీసులు ధృవీకరించారు. ముంబై క్రైం బ్రాంచ్ ఈ సంఘటనపై దర్యాప్తును మొదలుపెట్టింది.
బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో రణ్‌వీర్‌సింగ్‌కు భద్రతను మరింతగా పెంచారు. ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నారు. ఆయన అనుచరులు బాలీవుడ్ తారలే లక్ష్యంగా వరుస బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ల భద్రతపై ముంబయి పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిసింది.