‘వారణాసి’లో రామావతారం ఇదేనా?
మహేష్‌బాబు ‘వారణాసి’ సినిమా విడుదలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. అయినా ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా సోషల్‌మీడియాలో అభిమానులు రోజుకో సరికొత్త అప్డేట్తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
మహేష్‌బాబు ‘వారణాసి’ సినిమా విడుదలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. అయినా ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా సోషల్‌మీడియాలో అభిమానులు రోజుకో సరికొత్త అప్డేట్తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన ఎపిసోడ్లో మహేష్‌బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. నవంబర్‌లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా గుంటూరు పట్టణంలోని ఓ థియేటర్లో రాముడి అవతారంలో మహేష్‌బాబు డిజిటల్ డిస్ప్లే పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ చేతిలో విల్లు, మరో చేతిలో జపమాల ధరించి తేజోమూర్తిగా కనిపిస్తున్నారు మహేష్‌బాబు.
అయితే మేకర్స్ ఈ లుక్‌ని అధికారికంగా ప్రకటించనప్పటికీ..ఆయన ఇదే ఆహార్యంలో కనిపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ‘వారణాసి’ సినిమాలో రాముడి ఎపిసోడ్‌ను దాదాపు 60 రోజుల పాటు చిత్రీకరించామని గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి వెల్లడించారు. రాముడి పాత్ర కోసం మహేష్‌బాబు కలారి అనే ప్రాచీన యుద్ధ విద్యలో కూడా శిక్షణ తీసుకున్నారు. మొత్తానికి రాముడి గెటప్‌లో మహేష్‌బాబు డిజిటల్ రూపం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘వారణాసి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

