హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 9: ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజన్ రావు అన్నారు. బుధవారం కళాశాలలోని రాష్ట్ర మహాసభల పోస్టర్స్ విద్యార్థుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర మహాసభలు ఈనెల 25, 26, 27, తేదీల్లో ఖమ్మం జిల్లాలో జరుగనున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న కూడా విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులతో చర్చించి రాబోవు భవిష్యత్తు కార్యాచరణలను ఎజెండాలను ఎంచుకొని భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలు చేసేవిధంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు బిరెడ్డి జశ్వంత్, జిల్లా సహాయ కార్యదర్శి బొచ్చు ఈశ్వర్, సందీప్, రాజ్ కుమార్, అనూష, మౌనిక, ప్రవళిక, హర్షసాయి విద్యార్థులు పాల్గొన్నారు.