అధికార మధం, తలకెక్కిన అహంతో కొందరు కాంగ్రెస్ గూండాలు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయనీయం. ఇది పిరికిపంద చర్య. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు వారికే వత్తాసు పలుకడం సరికాదు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీలిచ్చి, అధికారంలో వచ్చిన తర్వాత జనానికి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు రోజులు దగ్గరపడ్డయి. ప్రజలు వారిని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పలువురు నాయకులు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదు
హనుమకొండ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు. రాష్ట్రంలో నడుస్తున్నది.. ప్రజాపాలన కాదు.. పైశాచికత్వ పాలన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సెక్రటేరియట్ శిలాఫలక మీద కేసీఆర్ పేరును తొలగించేందుకు మట్టిని రుద్దారు. ఈ రోజు ఏకంగా అధికార పార్టీ అన్న అహంతో తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లపాటు అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్లోని క్యాంపు కార్యాలయం మీద ఇలా దాడి చేయడం అత్యంత అవమానకరం. కేసీఆర్ అధికారిక క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన దుండగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
– బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి
దాడి హేయనీయం
బచ్చన్నపేట : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయనీయం. పట్టపగలు అధికార మధంతో విర్రవీగుతూ బీహార్ గ్యాంగులను తలపించేలా కార్యాలయంపై దాడి చేయడం అప్రజాస్వామికం. ఇది ప్రజాపాలన కాదు. గూండాల పాలన. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇందిరమ్మ రాజ్యం అంటూనే గూండాల రాజ్యం చేస్తున్నారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి.
– వేముల లక్ష్మణ్‌గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నేత
శాంతిభద్రతలు అదుపు తప్పాయి..
హసన్‌పర్తి : గజ్వేల్‌లోని కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నరు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలి. కఠినంగా శిక్షించాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
– బండి రజనీకుమార్, బీఆర్ఎస్ హసన్‌పర్తి మండల అధ్యక్షుడు
కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి
ములుగురూరల్ : కాంగ్రెస్ నాయకుల దాడుల కు బీఆర్ఎస్ నాయకులు భ యపడరు. ఆ పార్టీకి రోజు లు దగ్గరపడ్డాయి. తెలంగాణ తొలి సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి పిరికిపంద చర్య. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ గద్దెనెక్కి గూండాల రాజ్యంగా మార్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత కార్యాలయంపై దా డులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నా యకులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు కాంగ్రె స్ పార్టీకి ప్రైవేటు సైన్యంలా మారడం దుర్మార్గం.
-బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి
దాడిని ఖండిస్తున్నాం
కరీమాబాద్: గజ్వేల్‌లో కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. హామీల అమలును మరిచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నది. పోలీసులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి కేసులు నమోదు చేయాలి.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం..
దంతాలపల్లి : గజ్వేల్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండా రాజకీయాలకు తెరలేపింది. అధికార మధంతో చేస్తున్న ఆగడాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం. తెలంగాణలో ఎప్పుడూ లేని సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి సంస్కృతిని ఎక్కడా ప్రోత్సహించలేదు.
– ధర్మారపు వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
పిరికిపందల చర్య
దేవరుప్పుల : ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూనే కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో గూండారాజ్యం నడిపిస్తున్నారు. రాష్ట్రంలో మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతున్నాయంటే శాంతిభద్రతలు ఉన్నాట్టా.. లేనట్లా.. గజ్వేల్ ఘటనకు పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇందుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు కాంగ్రెస్‌కు ప్రైవేటు సైన్యంలా వ్యవహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ర్టాన్ని సాధించిన పార్టీ ఈ చిల్లర దాడులకు భయపడదు. ప్రజాపాలన గ్రామసభల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఛీకొడుతున్నారని అన్నారు. – గాంధీనాయక్, రాష్ట్ర జీసీసీ మాజీ చైర్మన్