హనుమకొండ, సెప్టెంబర్ 24: ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లాలోని ముప్కల్ మండలలో జరిగే రాష్ట్రస్థాయి బాలబాలికల సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, హనుమకొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్‌ఖాన్, జిల్లా స్పోర్ట్స్ అధికారి గూగులోతు అశోక్ కుమార్ టీషర్ట్స్బహూకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ సోదా రామకృష్ణ, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ ఆకుల సారంగపాణి, అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కృష్టారెడ్డి, అక్రమ్, దేవేందర్, వెంకటస్వామి, శంకర్ పాల్గొన్నారు.