మహదేవ్పూర్ : ఆర్థిక భారం భరించలేమంటూ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపీ ట్రాక్టర్లకు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాళాలు వేసి ఎంపీఓ ప్రసాద్ అప్పగించారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రతి రోజూ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డులకు తీసుకెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేసేదని, పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి.
దీంతో కొన్నేళ్లుగా పంచాయతీ కార్యదర్శులే ట్రాక్టర్ డీజిల్ నిర్వహణతో పాటు ఇతర ఖర్చులకు సంబంధించి అప్పులు చేస్తూ నిర్వహణ కొనసాగించామన్నారు. తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్ట లేక మనోవేదనకు గురవుతున్నామని మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శులు దామోదర్ రెడ్డి, అంజలి, సృజన్, సతీష్, రమేష్, ప్రసాద్, కుమార్, కల్పనా, గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.